Header Banner

రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు.. వాటి ఏర్పాటుపై లోకేశ్ ఏమన్నారంటే?

  Tue Mar 11, 2025 11:42        Politics

వివిధ రకాల రుగ్మతలకు గురై ప్రత్యేక ఏర్పాట్లు (స్పెషల్ నీడ్స్) అవసరమైన పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50 వేలు కూడా వసూలు చేస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ... స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని కోరారు. వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశమేర్పడుతుందన్నారు. అందుకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. "కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుచేసి, 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండి: ఒక్కసారిగా పడిపోయిన లిఫ్ట్.. పోలీస్ ఉన్నతాధికారి మృతి!

 

వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్ కు ఇద్దరు చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించాం. నూరుశాతం మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నాం. టీచర్-స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రైమరీలో 1:10, సెకండరీలో 1:15 నిష్పత్తిలో ఉండాలి. సెకండరీలో రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉంది. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో వివరించారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #LokeshSpeech #jagan #comments #viralvideo #lokeshmeeting #ycp #tdp